Thursday, July 26, 2012

అతను-ఏం చేస్తున్నావ్

ఆమె -నిశబ్ధానికి ఎన్ని సంకెల్లో లెక్క పెడుతున్నా


అతను-సంకెల్లన్న ీ తొలిగిస్తూ నీతోనే ఉన్నాగా?


ఆమె-అలాగే అనుకున్నా కాని నువ్వు అర్ధంతరంగా నీకు తెలియకుండా నన్ను ఒదిలిపోయావ్


అతడు-అదేంటి నా గుండె సడి నిన్ను అంటిపెట్టుకొనే ఉందిగా


ఆమె- సడి మాత్రమే ఉంది సంబంధిగా కాదు ఇబ్బందిగా నన్ను నిందిస్తూ అనుకుంటా


అతడు-ఏమయ్యింది?ఎందుకలా ?నీలో నుంచి నన్ను తోడేస్తున్నావ్?


ఆమె-తోడేయడం కాదు ఎంత నింపుకోవాలని చూసినా నాలో నువ్వు పూర్తిగా నిండటం లేదెందుకని 
ఆలోచిస్తున్నా


అతను-బంగారం యిదో నా శ్వాస తీసుకో శరీరాన్ని వదులుకోనైనా నీలో నీతో ఉండిపోతా..
అంటూ తనని గుండెకి హత్తుకున్నాడు ఆమె కన్నీటి సంతకాన్ని స్వీకరిస్తూ.....






































------------------------------------------------------మీ బుజ్జి